Friday, July 4, 2014

రతిక్రీడ మొదటిసారి చేస్తుంటే?

రతిక్రీడ మొదటిసారి చేస్తుంటే?


సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి. 

  • సురక్షితం - అన్నిటికంటే ప్రధానం సెక్స్ సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు. 
  • అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు. 
  • ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది. 
  • నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను షేమ్ భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రధాన రోల్ నిర్వహించటానికి అనుమతినివ్వకండి. 
  • అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి. 
  • భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి. 

మొదటి సారి చేసే రతి జంటలను కొంతమేరకు గాయపరుస్తుంది. అంతమాత్రం చేత మీరు ప్రేమ కలిగిలేరని భావించకండి. ఏదైనా గాయపడే పరిస్ధితివస్తే, ఒకరికొకరు సంభాషించుకొని రాజీకి రండి. మీ పార్టనర్ సున్నితమైతే తప్పక అర్ధం చేసుకుంటాడు. 

No comments:

Post a Comment