Thursday, June 19, 2014

ఆడవారిపట్ల మగవారు చేసే 10 క్రూరమైన పనులు

1.ఎక్కువ అహంకారాన్ని కలిగిఉండడం: పురుషుడు ఆదేశాలు తీసుకోవడానికి ఇష్టపడడు, 2 గంటలు ఆలస్యం 

అయినా సరే, గాస్ దండగ అయినా సరే వార౦తట వారే స్వంతంగా పనులు చేయడానికి ఎందుకు ఇష్టపడతారో 

ఎప్పుడైనా ఆలోచించారా? వారికి అహంకారం ఎక్కువగా ఉంటు౦ది. ఎప్పుడూ వారి చెప్పినట్లే జరగాలి, వారు 

చెప్పినట్లే వినాలనుకొనేవారు చాలా మంది ఉన్నారు.


2.కోరుకున్న జ్ఞాపకాల'తో బతకడం: వారికిష్టమైన ప్రతి క్రికెటర్, ఫుట్ బాల్ ఆటగాడి పేరు గుర్తుపెట్టుకోవడమే కాదు,

 వాళ్ళ స్కోర్ మాత్రం టక్కున చెప్పేస్తారు, కానీ మగవారు వారి దగ్గరి వ్యక్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు 

విషయానికి రాగానే వారికి ‘సెలక్టివ్ మెమొరీ సిండ్రోం'అనే వ్యాధి మొదలౌతుంది. అటువంటివేవి గుర్తుండవు. 

అయ్యే మర్చిపోయామే అటుంటారు.


3.దొంగతనంగా చూడడం (రోమ్ములకేసి చూడడం): ‘పురుషుడు స్త్రీ ఛాతీ వైపు తదేకంగా చూస్తాడని'ప్రపంచవ్యాప్త 

సర్వేలో అధికారిక ముద్ర వేసారు. అవును, వారు ఏ అవకాశాన్నీ కోల్పోరు, చివరకు వారు చూసే వారు ఇబ్బంది 

పడుతున్నా, లేదా వారి పక్క వారు ఇబ్బ౦ది పడుతున్నా సరే. చివరికి వారు వేరొక్కరితో డేటిగ్ లో ఉన్నపుడు 

కూడా ఇటువంటి పనులు మానరు!



4.బాగా పోసేసివ్ గా వుండడం : ఈ మగాళ్ళకి అంత అభద్రతా భావన ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కాదు? (అమ్మ 

నుంచా?) ఆడవాళ్ళు అసూయా పరులని వాళ్ళంటారు కాని అదే ఆడది మరొక మగవాడి పేరు చెప్పగానే ఇతను 

పెద్ద అయస్కాంతం లాగా మారిపోతాడు.


5.వాళ్ళ హిపోక్రసీ గురించి గొప్పగా భావించడం : మగవాళ్ళు ఇంతకన్నా క్రూరంగా కూడా ఉండగలరు ! వాళ్ళు 

మాత్రం ఊళ్ళోని అందమైన భామతో కులకాలి, కానీ అమ్మకి చూపించాలంటే మాత్రం సంసార పక్షంగా వుండే 

అమ్మాయి కోసం వెతుకుతారు. గర్ల ఫ్రెండ్ అబ్బాయిలతో నైట్ ఔట్స్ కు వచ్చినప్పుడు ఆమె పట్ల ఎక్కువ భద్రతా 

భావం కలిగి ఉంటడం, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను ఇష్టపడటం జరుగుతుంది. మరి పెళ్ళి తర్వాత?


6.అదనపు శ్రద్ధ చూపడం : మీరు ఇంట్లోంచి బయటకు రాగానే ‘ఎక్కడున్నావు' అని ప్రతీ పావు గంటకోసారి అతను 

కాల్ చేస్తుంటే ఎలా వుంటుంది? ఆ పిలుపులోని జాగ్రత్త గాలికెగిరి, ఇక చిరాకు మొదలౌతుంది. మగవాళ్ళు 

ఆడవారి జీవితంలోకి రాక ముందు కూడా హాయిగా, భద్రంగా, చక్కగా బతికామని వాళ్ళు గుర్తించారా?



7.ఎక్కడకెళ్ళిన వాళ్ళే సూపర్ మాన్ లా ఫీలవ్వడం: అవును, మగవాళ్ళు కాస్త సాయంగా పక్కన వుంటే బాగానే 

వుంటుంది. ప్రపంచంలో అన్ని పనులూ నేను చేయగలను' అనే ధోరణి మంచి కన్నా చెడుగానే ఎక్కువ సార్లు 

పరిణమిస్తుంది, మరీ ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు అవతార పురుషులుగా భావిస్తుంటారు. వాళ్ళ సూపర్ 

మాన్ వ్యక్తిత్వాన్ని అన్ని చోట్లకీ తీసుకురావడం: మగవాళ్ళు కాస్త సాయంగా పక్కన వుంటే బానే వుంటుంది. 

అయితే, ‘ప్రపంచంలో అన్ని పనులూ నేను చేయగలను' అనే ధోరణి మంచి కన్నా చెడుగానే ఎక్కువ సార్లు 

పరిణమిస్తుంది, మరీ ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు అవతార పురుషులుగా భావిస్తుంటే - ఓ ప్లంబర్, 

ఎలేక్ట్రీషియన్, ఓ కార్పెంటర్, ఒక ఆర్ధిక సలహాదారు అన్నీ ఒక్కరే అయినట్టు.



8.భావోద్వేగాలను వ్యర్థంగా భావించడం :ఒకే విషయంలో స్త్రీలు భావోద్వేగాలు కలిగి ఉండవచ్చు. కానీ మగవాళ్ళ 

లాగా  ఎప్పుడూ ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా అస్తమానూ పనికిరాదు. ఎగతాళి చేయకుండా, భావోద్వేగాలను 

పట్టించుకోకుండా ఉండకపోతే మగవాళ్ళు కూడా మంచి వాళ్ళే.




9.స్నేహితులు: పెళ్లి తరువాత మగాళ్లు వారి జీవితంలో ప్రాధాన్యాలు తెలుసుకోకపోతే స్త్రీలు చాలా బాధ పడవల్సి 

వస్తుంది. జీవిత భాగస్వామి కంటే స్నేహితులకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారి పార్ట్నర్ కోసం సమయం 

వెచ్చించడం కూడా కష్టమైతే ఆడవారు చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే వారి జీవితం 

రొమాంటిక్ గా మారుతుంది.


10.శృంగార రాక్షసుడుగా ఉండడం: నిస్సందేహంగా, పడుకున్నపుడు ఆడవారు హాస్యప్రసంగాన్ని ఇష్టపడతారు, 

కానీ గతరాత్రి వారు చూసిన చిత్రంలోని శృంగార తారలాగా ఉండమని భాగస్వామిని డిమాండ్ చేస్తూ పురుషులు 

చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఆమెను ఇబ్బంది పెట్టె బదులు ఆమెను ఆమెలాగే వదిలేయడం మంచిది, తరువాత 

సహకరించ లేదని నిందించకుండా.

No comments:

Post a Comment